Feb 12, 2025, 07:02 IST/
పోలీస్ కస్టడీలో నిందితుడు ఆత్మహత్య
Feb 12, 2025, 07:02 IST
నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకున్నది. పోలీస్ కస్టడీలో బుధవారం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. చోరీకేసులో పోలీసులు నిందితుడు రాజును అరెస్ట్ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన రాజు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, పోలీసుల వేధింపుల వల్లనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.