భారీగా తగ్గిన చికెన్, గుడ్లు ధరలు

83చూసినవారు
భారీగా తగ్గిన చికెన్, గుడ్లు ధరలు
బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ భయం, అధికారుల హెచ్చరికలతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కేజీ రూ.220 వరకు పలికిన ధరలు, బుధవారానికి రూ.150కి పడిపోయింది. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవడంలేదు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్