TG: ఏదో ఒక విధంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా HYD ఓల్డ్ సిటీలోని టప్పాచబుత్ర హనుమాన్ ఆలయంలో అపచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు శివలింగం వద్ద మాంసం ముద్దను పడేశారు. దీనిపై భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ దుశ్చర్య కు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.