పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ సూచించారు. అనారోగ్యానికి గురైన, వైరస్ సోకిన కోళ్లను పూడ్చిపెట్టాలన్నారు.