టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం Devara జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జపాన్‌లో పర్యటించారు. అయితే ఎన్టీఆర్ అభిమానుల ముందుకు రాగానే.. వారంతా అరుస్తూ వెల్‌కమ్ చెప్పారు. ఐ లవ్ యూ అంటున్న అభిమానులకు NTR ఐ లవ్ యూ టూ అంటూ రిప్లై ఇచ్చారు. ఆ వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఎన్టీఆర్. జపాన్‌లో భారతీయ సినిమాపై పెరుగుతున్న ఆసక్తిపై హర్షం వ్యక్తం చేశారు.