ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 'గత పాలకుల అహంభావం, మూర్ఖత్వం, అజ్ఞానం, రాజకీయ వివక్ష వల్ల పోలవరం ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగింది. కాఫర్ డ్యాం సకాలంలో పూర్తయితే ఈ నష్టం తప్పేది. డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న విషయం కూడా గోప్యంగా ఉంచారు. దీంతో ఊహించని విధ్వంసం సంభవించింది' అని అన్నారు.