సామర్లకోటలో అస్తవ్యస్తంగా శానిటేషన్

55చూసినవారు
సామర్లకోటలో అస్తవ్యస్తంగా శానిటేషన్
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు ప్రజలకు రోగాల తిప్పల్ని తెస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి వీధిలో వాహనంలో తిరుగుతూ సేకరించాల్సి ఉన్నా అది పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఫలితంగా ప్రధాన రహదారుల వెంట చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. పట్టణ పరిధిలో పలు ప్రాంతాలలో పందులు, కుక్కలు చెత్త కుప్పలను చెల్లా చెదురుగా చేయడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని పలువురు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్