చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నెహ్రూ

558చూసినవారు
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నెహ్రూ
తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా తుని మండలం ఎస్ అన్నవరానికి చెందిన సకురు నాగేంద్ర నేహు ఎన్నికయ్యారు. తుని పట్టణం లోని బాలాజీ రోడ్డులోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. 2024-26 కు కొత్త కార్యవర్గం ఎన్నిక చేశారు. కోశాధికారిగా సురేష్, ఉపాధ్యక్షులుగా డిఎన్ మల్లిబాబు, జూలూరి రామకృష్ణ, పామర్తి మహేష్ కారుమూరి భద్రరావు, సహాయ కోశాధికారి దుర్గాప్రసాద్ ను ఎంపిక చేశారు.

ట్యాగ్స్ :