
తుని: సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివ్య
తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పలువురికి ఇటీవల కాలంలో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అందించారు. అదేవిధంగా తుని నియోజకవర్గానికి సంబంధించి 15 పంచాయతీలకు 15 ట్రాక్టర్లు మంజూరైనట్లుగా తెలిపారు. నేరుగా ట్రాక్టర్లను పంచాయతీలకు ప్రభుత్వ విప్ అందజేశారు. తుని నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.