గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజాగా తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘అందరికి నూత సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ లండన్లో ఉన్నారు. ఇటీవలే ‘వార్-2' షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.