ప్రత్యేక హోదాపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

23923చూసినవారు
ప్రత్యేక హోదాపై లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ.. ప్రత్యేక హోదాపై భరోసా ఇవ్వగలదా? అనే ప్రశ్నకు ఆ పార్టీ నేత నారా లోకేష్ స్పందించారు. ‘దేశంలో ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఇన్సెంటివ్స్, కంపెనీలు తీసుకొచ్చేందుకు ప్రోత్సాహిస్తాం.’ అని లోకేష్ హామీ ఇచ్చారు.