ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి

51చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలో 100 పడకలతో ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడంతోపాటు, 73 పోస్టులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు రూ.52 కోట్లను మంజూరు చేసింది. అవసరమైన ఉద్యోగాల భర్తీ, మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని వైద్యశాఖ స్పెషల్ సెక్రెటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్