అమలాపురం: దివ్యాంగులకు ముఖ్య గమనిక

69చూసినవారు
అమలాపురం: దివ్యాంగులకు ముఖ్య గమనిక
దివ్యాంగుల సంక్షేమం కోసం అమలాపురం ఈదరపల్లి వంతెన దిగువన ఉన్న అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో ఉపకరణాల పంపిణీకి గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ శిబిరం జరుగుతుందని వివరించారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, చంక కర్రలు, చెవిటి, వినికిడి మెషీన్లు అందజేస్తారని తెలిపారు.