అమలాపురం: ప్రజా ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి: జేసీ

76చూసినవారు
ప్రజా ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ ఎం. ఝాన్సీ రాణి ఫిర్యాదులు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్