స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద బాడీ బిల్డింగ్ పోటీలు కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా పలువురు బాడీ బిల్డర్లు తమ కండలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి మెట్ల రమణ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, మోకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.