అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలపై 276 అర్జీలు అందజేశారని జేసీ తెలిపారు. అధికారులంతా జవాబుదారీతనంతో ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.