బాధిత కుటుంబానికి రమణారావు సాయం

85చూసినవారు
బాధిత కుటుంబానికి రమణారావు సాయం
ఉప్పలగుప్తం. మునిపల్లి పంచాయతీ కోటుగట్టు లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు పూర్తిగా దగ్దమై కట్టుబట్టలతో మిగిలిన తిరుకోటి సురేష్ కుటుంబానికి శుక్రవారం అమలాపురం నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు సాయం అందించారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు దుస్తులు, కూరగాయలను గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. రమణారావుకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్