కూలీలకు సౌకర్యాలు కలిగించాలి వెంకటేశ్వరరావు

79చూసినవారు
కూలీలకు సౌకర్యాలు కలిగించాలి వెంకటేశ్వరరావు
రాజోలు మండలంలోని కడలి, బి. సావరం, ములికిపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కూలీల పని పరిస్థితులను మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. జిల్లా ఉపాధ్యక్షలు శ్రీరాంమూర్తి, నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్