గోదావరి తూర్పు డెల్టా కమిటీ వైస్ చైర్మన్ గా అనపర్తి డి సి చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి శనివారంఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వేగుళ్ళ జోగేశ్వరరావు, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.