శరన్నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

61చూసినవారు
మామిడికుదురు మండలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు బుధవారం ఏర్పాట్లు చేశారు. మగటపల్లి గాయత్రీ త్రిశక్తి పీఠం, పాశర్లపూడిబాడవ, పెదపట్నంలంక, అప్పనపల్లి, పెదపట్నం తదితర గ్రామాల్లో అమ్మవార్ల ఆలయాల వద్ద భారీ ఎత్తున పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల కాంతులతో ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.