పి. గన్నవరం మండలం పి. గన్నవరంలోని గ్రేస్ డిగ్రీ కళాశాల వద్ద మహిళలు, బాలికల రక్షణపై ఎస్సై బి. శివకృష్ణ మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులకు మహిళల రక్షణ కోసం అమలుపరుస్తున్న చట్టాల గురించి ఈ సందర్బంగా ఎస్సై వివరించారు. ర్యాగింగ్, సైబర్ నేరాల నియంత్రణపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.