ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో శుక్రవారం రాత్రి మరోమారు డ్రోన్ ఎగుర వేయడం దుమారం రేపింది. ఇటీవల శ్రీవారి క్ష్రేతం మీదుగా ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో యూట్యూబర్‌పై ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. వరుసగా రెండో సారి ఘటన చోటు చేసుకుంది. కాగా సిబ్బంది డ్రోన్ ఎగుర వేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు చిక్కలేదు.