ద్వారకాతిరుమల: ఇంటర్ యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
అత్యాచారం చేసిన యువకుడిపై ద్వారకాతిరుమల పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ద్వారకాతిరుమల మండలానికి చెందిన యువతి, యువకుడు జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. ప్రేమ పేరుతో యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. ఇదే క్రమంలో నిన్న అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.