క్లాప్ డ్రైవర్ల మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ చేపట్టిన ఆందోళన 11వ రోజుకు చేరుకుంది. 11వ రోజు సోమవారం ఆందోళనలో భాగంగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నుంచి డ్రైవర్స్ అందరూ భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో కార్మికులు ఈరోజు భిక్షాటన చేశారని తెలిపారు.