వేల కోట్ల విద్యుత్ కుంభకోణానికి పాల్పడిన వ్యాపారవేత్త అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యాయురాలు బేబీరాణి డిమాండ్ చేశారు. సోమవారం అదానీని అరెస్ట్ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందం విషయంలో అదానీకి వేల కోట్ల ఆదాయం తెచ్చేలా గత వైసిపి ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు.