కాకినాడ రూరల్ తూరంగి శివాలయంలో శనివారం తెల్లవారుజాము నుంచి కార్తీక మాసం తొలిరోజు కావడంతో భక్తులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి దర్శించుకున్నారు. మహిళలుఆలయంలోపల దీపాలు వెలిగించారు. ఆలయంలోకి వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం అయ్యేవిధంగా ఆలయ కమిటీ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే పంతం నానాజీ స్వామివారిని దర్శించుకున్నారు.