ఎన్నో పరిశ్రమల ద్వారా దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన మహనీయుడు రతన్ టాటా అని కాట్రేనికోనకు చెందిన ప్రముఖ చిత్రకారులు ఆకొండి అంజి కొనియాడారు. రతన్ టాటా మృతి చెందిన నేపథ్యంలో గురువారం అతని చిత్రాన్ని అద్భుతంగా గీచి చిత్ర నీరాజనం పలికారు. అటువంటి మహనీయులు అరుదుగా మాత్రమే పుడతారని అంజి కొనియాడారు. నేటితరం అతన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.