బాధితునికి 20వేల ఆర్థిక సాయం

73చూసినవారు
బాధితునికి 20వేల ఆర్థిక సాయం
రాయవరం మండలం, పసలపూడిలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన దూళి నాగార్జునను జనసేవాదళ్ సంస్థ సభ్యులు సోమవారం పరామర్శించారు. మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ చొరవతో జనసేవాదళ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని బాధితుడికి సంస్థ సభ్యులు అందజేశారు. అనంతరం ప్రతి నెల అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేవాదళ్ సంస్థ సభ్యులకు లీలాకృష్ణ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్