బోటు ప్రమాద క్షతగాత్రుల్లో ఒకరి మృతి

572చూసినవారు
బోటు ప్రమాద క్షతగాత్రుల్లో ఒకరి మృతి
విశాఖ సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో బోటులో ఈ నెల 5న జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మత్స్యకారుడు రేఖాడి సత్తిబాబు(43) మృతి చెందాడు. సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా బోటులోని జనరేటర్ నుంచి మంటలు వ్యాపించడంతో తొమ్మిది మంది క్షతగాత్రులయ్యారు. 80 శాతం కాలిన గాయాలతో నాలుగు రోజులుగా విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సత్తిబాబు బుధవారం కన్నుమూశాడని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్