కోనసీమలో వింత.. తాటిచెట్టుకు కొమ్మలు

65చూసినవారు
ముమ్మిడివరం మండలం గేదెల్లంకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉత్తర వాహినిగా పిలవబడే పుష్కర ఘాట్ వద్ద ఓ తాటిచెట్టుకు కొమ్మలు వచ్చాయి. వాటిని గమనించిన రైతులు కొందరు వీడియోలు తీయగా. ఆదివారం వైరల్ గా మారాయి. తాటిచెట్టుకు కొమ్మలు రావడం తామెక్కడా చూడలేదని, కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన వింతలన్నీ జరుగుతాయని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొమ్మలను చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :