బాల కార్మికులతో పని చేయిస్తే కఠిన చర్యలు

77చూసినవారు
బాల కార్మికులతో పని చేయిస్తే కఠిన చర్యలు
బాల కార్మికులతో పనులు చేయిస్తే యజమానులపై కఠిన చర్యలు తప్పవని రాజోలు లేబర్ ఆఫీసర్ కేబీఆర్ శర్మ హెచ్చరించారు. సోమవారం కాట్రేనికోన మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన సైకిల్ షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేశారు. 18 ఏళ్ల లోపు వారిని పనుల్లో పెట్టుకోరాదని ఆయా యాజమాన్యాలకు సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ కనకరాజు, జన కల్యాణి సొసైటీ ఎన్జీఓ రాజు, సీఆర్ఎంటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్