పాము కాటుకు కౌలు రైతు మృతి

75చూసినవారు
పాము కాటుకు కౌలు రైతు మృతి
కౌలుకు తీసుకున్న కొబ్బరితోటలో పని చేస్తుండగా పాము కాటుకు గురై ఓ కౌలు రైతు మృత్యువాత పడ్డాడు. ముమ్మిడివరం మం. గాడిలంకలోని కొబ్బరితోటను కౌలుకు తీసుకుని అంతర పంటగా అరటి సాగు చేపట్టిన ఉప్పులగుప్తం మం. సన్నవిల్లికి చెందిన అరిగెల బాలాజీ (53) ఆదివారం తోటలో మందు పెడుతుండగా పాము కాటేసింది. ఆయనను చికిత్స నిమిత్తం స్థానికులు ముమ్మిడివరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్