యానాం, పుదుచ్చేరి, మాహే, కారైకల్ వ్యాప్తంగా పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా
ఇండియా కూటమి పిలుపు మేరకు ఈనెల 18న జరిగే బంద్ కు అందరూ సహకరించి విజయవంతం చేయాలని విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే)పార్టీ యానాం శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అదేరోజు యానాంలో సైతం పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించనున్నామని, కావున వ్యాపారవేత్తలు, పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.