విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఆగ్ని, వన్నీ కులక్షత్రియ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పుదుచ్చేరి ప్రత్యేక ఢిల్లీ ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సభ వేదికపై ప్రసంగించారు. ఆగ్ని, వన్నీ కులక్షత్రియులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. తన సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలియజేశారు.