భార్యాభర్తల మధ్య గొడవతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దాపురం శివారు తాడితోటలో ఆదివారం జరిగింది. తాడితోటకు చెందిన తాటికొండ శివ(28)పనికి వెళ్లకపోవడంతో కుటుంబం ఎలా నడుస్తుందని భార్య నిలదీయడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో శివ మనస్తాపంచెంది ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.