విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో లైన్ల ఏర్పాటు నేపథ్యంలో సామర్లకోట పట్టణంలో సోమవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ ప్రభాకర్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. దాంతో కోటపేట, పాత ఎమ్మార్వో ఆఫీసు, కొత్తపేట, పెద్దబజార్, బలుసులపేట, సంత మార్కెట్, ఇందిరాకాలనీ, నీలమ్మచెరువు, ఇస్మాయిల్నగర్, కుమ్మరవీధి, సంగీతరావుపేట, పోస్టాఫీసు ప్రాంతాల వారు సహకరించాలని కోరారు.