శంఖవరంలో డ్రైన్ నిర్మించాలని వినతి

51చూసినవారు
శంఖవరంలో డ్రైన్ నిర్మించాలని వినతి
శంఖవరం బస్టాండ్ వద్ద మెయిన్ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుందని, తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ విజయ్ కుమార్‌కు జనసైనికులు మంగళవారం ఫిర్యాదు చేశారు. మురుగు నీరు వలన రోడ్డుపై గోతులు పడడంతో వాహనాలు నడిపే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైన్లు నిర్మించాలని కోరారు. తగు చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో హామీ ఇచ్చారని జనసైనికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్