ఎమ్మెల్యే సత్యప్రభను కలిసిన వైద్య బృందం

59చూసినవారు
ఎమ్మెల్యే సత్యప్రభను కలిసిన వైద్య బృందం
ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల బృందం ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎకు బృందం సభ్యులు సత్యప్రభకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యేకు వివరించారు. ఎంఎల్‌ఎను కలిసిన వారిలో వైద్య అధికారి జానకిదేవి, డాక్టర్‌ పావని, డాక్టర్‌ సునీత, ఆరోగ్య మిత్ర శ్రీనివాస్‌ తదితరులున్నారు.