కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా, జనసేన పార్టీ ఇంచార్జ్ వరపుల తమ్మయ్య బాబు, నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ ఆదేశాల మేరకు.. మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే 100 రోజులైనా సందర్భంగా ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.