గ్రామాల్లో ప్రధానంగా రోడ్లు, మంచినీరు, వైద్యం వంటి మౌలిక సౌకర్యాల కల్పన పై ప్రధానంగా దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కె. గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో మన గ్రామం మన సుభాష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి సుభాష్ మంగళవారం పర్యటించారు.