రామచంద్రపురం మండలం తోటపేట చెందిన దామిశెట్టి మహాలక్ష్మి (54) అనే మహిళ ఈ నెల 12వ తేదీన చనిపోయారు. సహజ మరణంగా భావించిన బంధువులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆమె ఒంటిపై బంగారం లేదని గుర్తించిన బంధువులు అనుమానంతో పోలీసులకు శుక్రవారం పిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు.