గాంధీ జయంతిని పురస్కరించుకొని మలికిపురానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సంగీత్ గీసిన గాంధీ చిత్రం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శాంతి, అహింసలే ఆయుధంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్ర ఉద్యమ నేత మహాత్మ గాంధీ అని చాటేలా గాంధీ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మలికిపురంలోని సునయన ఆర్ట్స్ అకాడమీలో ఈ చిత్రాన్ని బుధవారం ప్రదర్శించారు.