స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు అని స్వచ్ఛ చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ. ఆర్. కే. ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం జాతీయ రహదారి వద్ధ నిర్వహించారు. హైవే మలుపు, రోడ్డు, ఇరువైపులా శుభ్రం చేసి సుందరంగా మార్చారు. నూతనంగా నిర్మిస్తున్న ముఖద్వారం వద్ధ శుభ్రం చేసి పరిశుభ్రంగా మార్చారు. కార్యక్రమంలో సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి పాల్గొన్నారు.