అవనిగడ్డ నియోజకవర్గంలో అక్రమాలకు తావు లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం చల్లపల్లిలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చూడాలని పోలీస్, రెవిన్యూ అధికారులకు సూచించారు. చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో విస్తరించిన నెంబర్లాట జూదం పూర్తిగా అరికట్టాలన్నారు. అక్రమాల రహితమైన నియోజకవర్గంలా అవనిగడ్డ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్నారు.