అమ్మ ఒడి భాషగానే ఉండాలనేదే నా కోరిక

54చూసినవారు
అమ్మ ఒడి భాషగానే ఉండాలనేదే నా కోరిక
తెలుగు భాష బడి భాషే కాదు. ఎప్పటికీ అమ్మ ఒడి భాషగానే ఉండాలనేదే నా కోరిక అని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఘంటసాల విచ్చేసిన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రుల రాజధాని అమరావతిలో 2026 జనవరి 4, 5, 6 తేదీల్లో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించనున్నామని తెలిపారు. ఐదుగురు దేశాధ్యక్షులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పిలుస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్