ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజుల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్క రోజుకు గానూ వివిధ సేవా టిక్కెట్ల రుసుము ద్వారా రూ. 6, 74, 509 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయక కమిషనర్ సూర్యచక్రధరరావు సోమవారం తెలిపారు. ఆదివారం సెలవు రోజు కావడంతో దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు.