వరద బాధితులను ఆదుకునేందుకు అవనిగడ్డ నియోజకవర్గం విద్యా కుటుంబం అందించిన సహాయం అపూర్వం అని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి పేర్కొన్నారు. మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో 2600 వరద బాధిత కుటుంబాలకు విద్యా కుటుంబ సేకరించిన 29. 78 లక్షలతో వంట పాత్రలను శనివారం రాత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వరద బాధితులకు జరిగిన నష్టం పూడ్చలేనిది అన్నారు. ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.