గుడివాడ టిడిపి కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

62చూసినవారు
గుడివాడ టిడిపి కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం (ప్రజా వేదిక)లో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, టిడిపి నేతలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్