

కౌతవరంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో, గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఎమ్మెల్యే రాము ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 48లక్షల నిధులతో మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జరగనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్య క్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.