రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

71చూసినవారు
రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని
గుడివాడ ముబారక్ సెంటర్ వద్ద గల మియా ఖాన్ మసీదులో గురువారం జరిగిన రంజాన్ పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే నానికు మైనార్టీ పెద్దలు ముస్లిం సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా సర్వ మానవాళి సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మత గురువులు నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్